Friday, 11 October 2019

కెసిఆర్ సర్కార్ కు గుణపాఠం తప్పదు: నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్

 7వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో   ఆర్టీసీ కార్మికులతో ప్రెస్ క్లబ్ నుండి  ధర్నా చౌరస్తా కు ర్యాలీ గా వెళ్లి బైటాయించడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ధర్నా స్థలికి వచ్చి వినతిపత్రం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాడాలన్నారు. సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెలతానన్నారు. ఆర్టీసీకి కార్మికులకు మద్దతుగా ప్రజలందరూ ఉన్నారన్నారు. కెసిఆర్ నియంతృత్వ వైఖరి విడనాడాలని, వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో చేసేలా కార్యచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే సర్కార్ కు గుణపాఠం తప్పదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలు వెంటనే మానుకోవాలని హితవు పలికారు.  అనంతరం జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు కు, అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రాలు ఇచ్చి, ధర్నా చౌరస్తా నుండి పులాంగ్ చౌరస్తా  వరకు ర్యాలీ గా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రం ఇవ్వడం జరిగింది.          కార్యక్రమంలో JAC కన్వీనర్ భాస్కర్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి. ప్రభాకర్, IFTU రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణ బిఎల్ఎఫ్ దండి వెంకట్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేషుబాబు, PYL సుధాకర్, , గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు రాజగంగారెడ్డి, TDP యాదగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు బస్వా లక్మి నర్సయ్య, యెండల సుధాకర్, DTF శాంతన్,ఆర్టీసీ జెఎసి నాయకులు శ్రీనివాస్, సాయిలు, నర్సయ్య,  సంజీవ్, ప, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కు వినతి పత్రం అందజేస్తున్న అఖిలపక్ష కమిటీ నేతలు 
మాట్లాడుతున్న నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ 


ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆందోళన 

  

No comments:

Post a Comment