Saturday, 12 October 2019

రేపు నిజామాబాదు జిల్లా కేంద్రం కలెక్టరేటులో రాజశ్యామల యాగం

నిజామాబాదు వార్త : నేడు (ఆదివారం) నిజామాబాద్ నగరంలో రాజశ్యామల యాగం, గజోత్సవం, సహస్ర జ్వాలా తోరణ చంద్ర మండల మహాపూజ నేడు (ఆదివారం) నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి నుండి రాత్రి 11:30 వరకు కోజాగిరి పౌర్ణమి సందర్భంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు కలవని బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషిగారు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాజశ్యామల యాగం అదే విధంగా సాయంత్రంనాలుగు గంటలకు ఏనుగుపై అమ్మవారిని ఊరేగిస్తూ గజోత్సవం శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని కార్యక్రమాల్లో నిజామాబాద్ నగర మరియు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రదీప్ జోషిగారు విజ్ఞప్తి చేశారు. సంతాన యోగం, విదేశీ యోగం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభ ప్రాప్తి మరియు లోక  కళ్యాణార్ధం నిర్వహిస్తున్న ఈ యాగం మరియు అమ్మవారి గజోత్సవ శోభాయాత్ర అదే విధంగా సాయంత్రం నిర్వహించు సహస్ర జ్వాలా తోరణ చంద్ర మండల మహా పూజలోపాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. సాయంత్రం ఎనిమిది గంటల నుండి సుమంగళీ పూజ, స్వాతి  ముత్యాల పూజ, లక్ష పుష్పార్చన, శ్రీచక్ర అర్చన కార్యక్రమాలు కలవు అని తెలిపారు. రాజశ్యామల యాగం ఉదయం ఎనిమి గంటలకు మొదలవుతుందని అదేవిధంగా అమ్మవారిని ఏనుగుపై ఊరేగించు గజోత్సవ శోభాయాత్ర కాయ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుందని తెలిపారు. సాయంత్రము నిర్వహించు వివిధ విశేష పూజలు సాయంత్రం 8 గంటలకు  మొదలవుతాయని తెలిపారు. ఉదయం రాజశ్యామల యాగం అదేవిధంగా సాయంత్రపు విశేష పూజలు అన్ని కూడా కలెక్టర్ గ్రౌండ్ మైదానంలో జరుగుతాయని తెలిపారు. అమ్మవారి గజోత్సవం శోభాయాత్ర కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తా నుండి మొదలై ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుండి ఫులాంగ్ చౌరస్తా నుండి రాజేంద్ర చౌరస్తా నుండి నెహ్రు పార్క్ నుండి గాంధీ చౌక్ నుండి బస్టాండ్ ముందుగా సాగి రైల్వే స్టేషన్ ముందు నుండి తిరిగి కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తాకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషితో పాటు శ్రీ సుభాష్ శర్మ, నరాల సుధాకర్  పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ప్రదీప్ జోషి, పక్కన జిల్లా బీసీ నేత నరాల సుధాకర్ No comments:

Post a Comment