Saturday, 4 May 2019

లయన్స్ క్లబ్ ఆఫ్‌ ఇందూర్ నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌‌ వార్త:  క్లబ్ ఆఫ్‌ ఇందూర్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. శుక్రవారం రాత్రి సందీప్ గార్డెన్స్ లో జరిగిన ఎన్నికలలో లయన్స్ క్లబ్ సభ్యులు 2019-20 సంవత్సరానికి గాను  నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. లయన్స్ క్లబ్ ఆఫ్‌ ఇందూర్ అధ్యక్షుడిగా ఎం.లక్ష్మినారాయణ భరద్వాజ్, కార్యదర్శిగా చింతల గంగాదాస్, కోశాధికారిగా సిలివేరి గణేష్ ఎన్నికయ్యారు. ఉపాద్యక్షులుగా దేవల్ భజరంగ్, తాటికొండ సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా మచ్చ రవి, పీఆర్వోగా గర్దాస్ శంకర్, లయన్ టేమర్ గా కె.బాల్ చందర్, ట్వెయిల్ ట్విస్టర్ గా దొంతుల చంద్రయ్య, జీఎస్టి కో-ఆర్డినేటర్ గా మీసాల ప్రభాకర్, సభ్యత్వ నమోదు కమిటీ చైర్మెన్ గా  బొంతపల్లి గురుప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అదే విధంగా లయన్స్ క్లబ్ డైరెక్టర్లుగా ఇరుమల శివలింగం, యెండల శంకర్, బంటు రాజయ్య, రావి నేతాజి, కృష్ణా రెడ్డి, లోక నర్సింహరెడ్డి , రామక్రిష్ణా రెడ్డి, డాక్టర్ డిఎల్ ఎన్ స్వామి,  పుల్గం హన్మాండ్లు,డాక్టర్ కె ఎన్ శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్, ఆకుల రాజలింగం లు ఎన్నికయ్యారు.ఎన్నికల అధికారిగా లయన్స్ క్లబ్ పూర్వాద్యక్షులు పి.లక్ష్మీనారాయణ వ్యవహరించారు. లయన్స్ సేవలు మరింత విసృతపర్చి పేదల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అద్యక్ష కార్యదర్శులు లక్ష్మినారాయణ భరద్వాజ్, చింతల గంగాదాస్, కోశాధికారి సిలివేరి గణేష్ చెప్పారు. లయన్స్ ప్రతిష్ఠను పెంచుతామన్నారు. ఉచిత ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులు యువత కోసం వ్యక్తిత్వ వికాస శిబిరాలు తదితర కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అద్యక్ష కార్యదర్శులు లక్ష్మినారాయణ భరద్వాజ్, చింతల గంగాదాస్

No comments:

Post a Comment