Sunday, 5 May 2019

ఘనంగా మానిక్‌‌భవన్‌‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్‌‌ వార్త: నగరంలోని మానిక్‌‌భవన్‌‌ ఉన్నత పాఠశాల 1969 పూర్వ విద్యార్థుల మొదటి ఎస్సెస్సీ బ్యాచ్‌‌ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తమకు విద్య బోధించిన ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, దస్తయ్య, తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఇన్ని సంవత్సరాల అనంతరం గురువులను గుర్తుంచుకొని సన్మానించడం అభినందనీయమన్నారు. ఇంతమంది 1969 మొదటి బ్యాచ్‌‌ విద్యార్థులం కలవడం సంతోషంగా ఉందన్నారు.  అప్పటి విద్యార్థులనందరిని పోగు చేసి కార్యక్రమం నిర్వహించడం చాలా  కష్టమైన పని అని, సమయం వెచ్చించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఆకట్టుకొన్నాయి. స్వర్ణోత్సవాల కన్వీనర్లను ఈ సందర్బంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్‌‌జూబ్లీ సెలెబ్రేషన్స్‌‌ సంస్థ అధ్యక్షుడు పార్శి విజయ్‌‌కుమార్‌‌ గుప్త, ప్రధాన కార్యదర్శి టి.విశ్వనాథం, కోశాధికారి కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్‌‌ సెక్రెటరి లక్ష్మారెడ్డి, అరవింద్‌‌రెడ్డి, డాక్టర్‌‌ వినోద్‌‌కుమార్‌‌ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న పూర్వ ఉపాధ్యాయుడు

కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు

గురువును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

గురువులతో గోల్డెన్‌‌జూబ్లీ వేడుకల కమిటీ సభ్యులు

వీడీయో కోసం క్రింద వీడియోను క్లిక్‌‌ చేయండి.....



మరిన్ని వీడియోలకోసం ఇక్కడ క్లిక్‌‌ చేయండి...

No comments:

Post a Comment