Sunday, 5 May 2019

పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం

  నగర మేయర్ ఆకుల సుజాత 

నిజామాబాద్‌‌ వార్త: 1968 1969 వ సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఖలీల్‌‌వాడి పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు ఈ మేరకు ఆదివారం నగరంలోని ప్రగతి నగర్ లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కార్పొరేటర్ అధ్యక్షతన 19 68 19 69 వ సంవత్సరం హెచ్ ఎస్ సి ఇ పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ఆకుల సుజాత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ.. చిన్ననాటి స్నేహితులను ఒక తాటి మీదికి వచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కలుసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు చిన్ననాటి జ్ఞాపకాలతో తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది అని అన్నారు అలాగే గురువులను కలుసుకోవడం వారు చెప్పిన విద్యాబుద్ధులను గుర్తు తెచ్చుకోవడం ఎంతో ఆనందించదగ్గ విషయం అన్నారు. అనంతరం దారం సాయిలు కార్పొరేటర్ ఆధ్వర్యంలో లో గురువు లను ఘనంగా సన్మానించారు అలాగే తోటి మిత్రులను కార్యక్రమంలో శలువ తో సత్కరించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా తోటి మిత్రులతో గడిపి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో గంగా భూషణ్, నరసింహాచారి, బైరయ్య, చిలకల రాజు, సుధాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్ లతోపాటు 1968‌‒69 హెచ్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్టులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు

గురువులతో పూర్వ విద్యార్థులు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్‌‌ చేయండి



No comments:

Post a Comment