Saturday, 18 May 2019

కమెడియన్ ధన్‌రాజ్ దూలతీరింది..

పవన్‌ కల్యాణ్‌కువచ్చే సీట్ల గురించి పోస్ట్.. ట్రోల్స్‌తో నెటిజన్ల రచ్చ

నిజామాబాద్‌‌ వార్త: ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తరంగా ఎన్నికల జరగడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొన్నది. గత ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ చేసినా.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కొన్నివర్గాలు మాత్రం జనసేనను అంత తేలికగా తీసుకోవద్దని వెల్లడిస్తున్నాయి. అయితే జనసేన సాధించే సీట్లను అంచనా వేసిన యాక్టర్ ధన్ రాజ్ పప్పులో కాలేసినట్టు కనిపిస్తుంది. అసలేం జరిగిందంటే...

ఏపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన ఏపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం ఇప్పటికీ చర్చనీయాంశమవుతున్నది. అంతేకాకుండా జనసేనను టార్గెట్ చేసుకొని భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనసేన సాధించే సీట్ల గురించి టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు కామెడీని పండించింది.


120 నుంచి 145 సీట్లు అంటూ..

బంగాళాఖాతంలో అల్పపీడనం..! 23న తుఫానుగా మారి, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి "జనసేన శతఘ్ని" అని నామకరణం చేశారు' అంటూ ధన్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్

సాధారణంగా పవన్ కల్యాణ్‌కు ధన్ రాజ్ ఫ్యాన్ కావడంతో అభిమానం కొద్ది అలా కామెంట్ చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని, సుమారు 120 నుంచి 145 సీట్లు గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేయడంతో ఆ పోస్టును నెటిజన్లు కామెడీగా మార్చారు. రకరకాల కామెంట్లతో హడలెత్తించారు.పోస్టు తొలగింపుతో..

తాను చేసిన పోస్టు గందరగోళం సృష్టిస్తుందనే కారణంతో ధన్ రాజ్ తన పోస్టును తొలగించారు. కానీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫేస్‌బుక్‌లో కాదు.. జబర్దస్త్‌లో కామెడీ చేయి. అభిమానానికి కూడా హద్దు ఉండాలి అంటూ కామెంట్లను విసిరారు. రకరకాల మెమొలతో సెటైర్లు వేశారు. అయితే ధన్‌రాజ్ ఏదో తెలియక చేశాడా? తెలిసి చేశాడా అనే విషయం మే 23న తేలడం ఖాయమనే అంటున్నారు.

హైపర్ ఆది తర్వాత ధన్ రాజ్ రంగంలోకి..

ఇప్పటి వరకు జనసేనకు అండగా జబర్దస్త్ ఆది మాత్రమే తన అభిమాన స్వరాన్ని వినిపించే వారు. జనసేనకు బాహాటంగా మద్దతు తెలిపినట్టు మరోకరు కనిపించలేదు. తాజాగా ధన్‌రాజ్ ఆ జాబితాలో చేరిపోయారు. మున్ముందు పవన్ కల్యాణ్‌కు ఇంకా ఎవరు అండగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.


No comments:

Post a Comment