Wednesday, 8 May 2019

ఎండలో పిల్లలను బయటకు పంపకండి,

ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు  డాక్టర్ బి కేశవులు

నిజామాబాద్‌‌ వార్త: దేశంలో రాష్ట్రంలో సూర్యుని ప్రతాపం భగభగ లాడుతోంది,పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్లయినా సరే బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు , ఇంతటి ఉష్ణోగ్రత లో పిల్లలు ,పెద్దలు  బయటకి వెళ్లక పోవడమే చాలా మంచిదని మనో విజ్ఞాన వేదిక అధ్యక్షులు ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు అన్నారు,
రాష్ట్రంలో  ” పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు - వడదెబ్బ పరిణామాలు ““ అంశాలపై  ఖలీల్ వాడి లోని మనో విజ్ఞాన వేదిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు డాక్టర్ బి కేశవులు హాజరై ప్రసంగించారు,
పిల్లలలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రాలు పిల్లలలో బలహీనంగా ఉండటం మూలాన వడదెబ్బకు గురి అయ్యే కాశాలు అధికము, చిన్నపిల్లల్లో శరీరంలోని నీటి పరిమాణము కూడా చాలా తక్కువ అయితే అధిక శరీర ఉష్ణోగ్రతలు మరియు చిన్న పిల్లలలో శరీరంలోని  తక్కువగా ఉన్న నీరు ఎక్కువగా  ఆవిరైపోతుంది అంతేకాకుండా 104 ఉష్ణోగ్రతలు దాటిన  సందర్భాలలో ఫిట్స్  వచ్చే అవకాశం చిన్న పిల్లలలో ఎక్కువగా ఉంటుందని  డాక్టర్ కేశవులు తెలిపారు,
బయటకు వెళ్లాలంటే అవసరమనుకుంటేనే వెళ్లాలని అలాగే ద్రవపదార్థాలు తీసుకోవాలని, పండ్లు కూరగాయలు రసాలు తీసుకోవడం చాలా మంచిది అన్నారు,
 అట్లానే పరిశుభ్రమైన నీరు  ఆహారము తాజా గా ఉన్నప్పుడే తినాలని, బయట దొరికే జ్యూస్ గానీ పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్ బి కేశవులు ప్రజలను హెచ్చరించారు,
చాలామందికి  శరీరంపై బొబ్బలు రావడం తలనొప్పి, నిస్సత్తువగా ఉండటం ,వాంతులు, తలనొప్పి, కాళ్లు  పట్టుకోవడము, చేతులు చల్లబడటం, ఆందోళనకు గురికావడం  లాంటివి వడదెబ్బ లక్షణాలని వీటికి దూరంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రజలకు డాక్టర్ కేశవులు వివరించారు,
అయితే ఎండలో  ఎలాంటిఆటలు ఆడుకోవద్దని వ్యాయాయం లాంటివి చేయకూడదని మద్యము , మత్తు పదార్థాలకు, ఫాస్ట్ ఫుడ్ పదార్థాలకు దూరంగా ఉండవలెనని సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకూడదని, చల్ల పడిన తర్వాతే  దానికి ప్రయత్నించాలని  ప్రజలకు  డాక్టర్ కేశవులు సూచించారు
ఇంకా క్రమంలో విజ్ఞాన వేదిక కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచే వచ్చిన రోగుల బంధువులు  పెద్దఎత్తున పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్‌‌ కేశవులు

No comments:

Post a Comment