Tuesday, 7 May 2019

మహాత్మా బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడు - కలెక్టర్

నిజామాబాద్ వార్త: మహాత్మ బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడు, సంఘ సంస్కర్త అని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ లో మహాత్మా బసవేశ్వరుని 886 వ జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ఆ  జ్యోతి జ్యోతి వెలిగించి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 9 వ శతాబ్దం లోనే ఆయన ఈ రోజుల్లో అనుసరించే ఎన్నో  సంఘసంస్కరణలకు  శ్రీకారం చుట్టారన్నారు. మూఢ నమ్మకాలను పారద్రోలడానికి కృషి చేశారని, కులాంతర వివాహాలను ఆయన ఆ కాలంలోనే ప్రోత్సహించారన్నారు . లింగభేదం లేకుండా, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సమానమేనని, అందరూ శాంతి సామరస్యాలతో జీవనం సాగించాలని ఆయన తన జీవన విధానం ద్వారా అనుసరించి ఇతరులకు బోధించారని అన్నారు. భక్తి ఉద్యమాన్ని, సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణంలో   బసవేశ్వరుని  బోధనల గురించి తెలిపారన్నారు. ఆయన పేరుమీద  ఒక  నాణాన్ని ప్రభుత్వం  విడుదల చేసిందని ఇంగ్లాండ్లో ఆయన విగ్రహాన్ని 2015లో ఆవిష్కరించారని తెలిపారు. మన పార్లమెంటులోనూ 2003లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మహిళలు కూడా మతమైన కార్యక్రమాలలో పాల్గొనాలని, సామాజిక, ఆర్థిక అంశాలలో చర్చించడానికి వారికి అవకాశం కల్పించాలన్నారు. భక్తి మార్గమే అన్నిటికంటే ముఖ్యమని, మోక్షానికి అదే మార్గమని, వేదాల మూల సూత్రాలను అర్థం చేసుకోవాలని బోధించారన్నారు. శైవ మత ఆచారాలను పునరుజ్జీవింపచేయడానికి ఆయన జంగమ సాంప్రదాయాన్ని నెలకొల్పారన్నారు. ఆయన బోధించిన బోధనలు, చూపిన మార్గాలు ఇప్పటికీ అనుసరణీయమని, వాటిని తప్పకుండా పాటించ వలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన తెలిపారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, సమాచార శాఖ ఉపసంచాలకులు ముర్తుజా అలీ, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎమ్.రాజేశ్వర్ , న్యాయవాది ఏఎస్ పోశెట్టి, వీరశైవ లింగాయత్ సంఘాల ప్రతినిధులు శివ కుమార్, సిద్ది రాములు, అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ ఉద్యోగులు ప్రగతి భవన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment