Sunday, 5 May 2019

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌‌

నిజామాబాద్ వార్త:  ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు నైతికతను పాటించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అన్నారు జిల్లాలో మొదటి విడత జెడ్ పి టి సి ఎంపీటీసీ ఎన్నికలు నిజామాబాద్ డివిజన్లోని  ధర్పల్లి డిచ్పల్లి ఇందల్వాయి మాక్లూర్ mopal నవీపేట నిజామాబాద్ సిరికొండ మండలాలలో 8  జడ్పీటిసి  లు 100 ఎంపీటీసీ ల కాగా అందులో 7 జడ్పీటిసి లకు 94 ఎంపిటిసి లకు ఎన్నికలు జరుతాయని చెప్పారు. అందులో మాక్లూర్ జెడ్ పి టి సి ఏకగ్రీవం కాగా మండలంలోని మాదాపూర్ కొత్తపల్లి ఇందల్వాయి మండలంలోని చంద్రయన్ పల్లి డిచ్పల్లి మండలంలోని దూస్ గా మ్  సిరికొండ మండలం లోని న్యా బ నంది కొండూరు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు మొదటి విడతలో రెండు లక్షల 17 వేల 729 మంది ఓటర్లు కాగా అందులో ఒక లక్ష 16 వేల 729 మంది మహిళా ఓటర్లు కాగా ఒక లక్ష 880 పురుష ఓటర్లు ఇద్దరు ట్రాన్స్ జెండర్ ఓటర్ ల కోసం 538 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  పోలింగ్ సమర్థ నిర్వహణ కోసం మొత్తం 3734 మంది పోలింగ్ సిబ్బంది ని 20 శాతం అదనంగా కలుపుకొని విధులు నిర్వహిస్తారని అందులో 646 పి వో లు ఏ పీ ఓ లు 646 ఇతర పోలింగ్ సిబ్బంది 2442 మందిని నియమించినట్లు కలెక్టర్ వివరించారు మొదటి విడత నిజాంబాద్ డివిజన్లో ఈనెల 6న జరుగు జెడ్ పి టి సి ఎంపీటీసీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నందున అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎండలు తీవ్రంగాఉన్నందున  ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలుగకుండా చల్లటి త్రాగునీరు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రథమ చికిత్స కేంద్రం ఎలక్ట్రిసిటీ నిరంతర సరఫరా ఏర్పాట్లు చేయడం జరిగిందని అదేవిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీల్చైర్లు రామ్స్ కూడా ఏర్పాట్లు చేసినందున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ముందుకు రావాలని కోరారు
మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్స్ తో పాటుగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేందుకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేసినట్టు  అందరూ పోలింగ్ సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరుకున్నారని కలెక్టర్ చెప్పారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment