Sunday, 5 May 2019

పడకంటి రాముకు ’సేవా మిత్ర తరంగిణి’ అవార్డు

నిజామాబాద్ వార్త:   దాసరి నారాయణరావు గారి జయంతి సందర్బంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికి కళల్లో ప్రతిభ కనబర్చినవారికి హైద్రాబాద్ రవీంద్రభారతి లో అవార్డులను ఇవ్వటం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ కు చెందిన లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ పడకంటి రాము నిస్వార్థంగా స్వంత డబ్బులు ఖర్చుపెడుతూ రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో చేసే వివిధ సామాజిక సేవల్ని గుర్తించి "సేవా మిత్ర తరంగిణి" అవార్డును అందచేశారు.ఈ అవార్డు కార్యక్రమ ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  మరియు తమిళనాడు మాజీ గవర్నర్ అయినటువంటి ప్రముఖ రాజకీయ రారాజు రోశయ్య గారి చేతుల మీదుగా పడకంటి రాము తీసుకోవటం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ కళా గురువులు,  లయన్ విజయకుమార్,ప్రోగ్రాం నిర్వాహక బృందం ,వివిధ అవార్డు గ్రహీతలు,150 మంది ప్రాచీన నవీన నాట్య కళాకారులు,జబర్దస్త్ జూలకటక ఫేమ్ హరీష్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సేవకార్యక్రమాల్లో తనకు ఎంతగానో ప్రోత్సహిస్తూ సహకరించే తన శ్రీమతి పడకంటి సాత్విక మరియు తన ఫౌండేషన్ టీం,మీడియా మిత్రుల వలననే ఈ అవార్డు అందుకున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ అందరికి కృతజ్ఞతలు తెలిపారు.మొన్నటి స్ఫూర్తి రత్న నేటి సేవా మిత్ర తరంగిణి అవార్డులు సమాజం పట్ల బాధ్యతను మరెంతగానో పెంచిందని అందువల్ల ఇంకా ఎక్కువ అంకితభావంతో ఎంతోమంది లభ్ది పొందేలా సేవా కార్యక్రమాలు చేస్తానని పడకంటి రాము పేర్కొన్నారు.

తమిళనాడు మాజీ గవర్నర్‌‌ రోశయ్య చేతుల మీదుగా అవార్డు అందుకొంటున్న పడకంటి రాము

నిర్వాహకులతో ‘సేవామిత్ర తరంగిణి’ అవార్డు గ్రహీత పడకంటి రాము

వీడియోల కోసం ఇక్కడ క్లిక్‌‌ చేయండి....


3 comments: