Sunday, 5 May 2019

ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

-  జిల్లా ట్రెజరీ అధికారి

నిజామాబాద్ వార్త:   ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి వైద్యం, విద్య కారణాలపై రుణాలకు ఉద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ట్రెజరీ ఉప సంచాలకులు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

4వ తరగతి ఉద్యోగులు, ఎన్జీవోలు రుణాలకు అర్హులని, అసిస్టెంట్ సివిల్ సర్జన్ లేదా సివిల్ సర్జన్ నుండి   ధ్రువ  పత్రం పొందిన వారు వైద్య కారణాలపై రుణాలకు, అదేవిధంగా విధంగా సంబంధిత పాఠశాల నుండి ఫీజు కు సంబంధించి ధృవ పత్రం సమర్పించి విద్యా రుణాలు పొందుటకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  దరఖాస్తు ఫారాలు ట్రెజరీ కార్యాలయాలైన ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి,  ఎల్లారెడ్డి, మద్నూర్  కార్యాలయాల నుండి పొందవచ్చన్నారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత డిడిఓల ద్వారా ఈ నెల 15వ తేదీ లోగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలోగా సమర్పించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment