Sunday, 5 May 2019

కోర్టుల ఆధునీకరణకు కృషి :

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్

నిజామాబాద్‌‌ వార్త:  అవసరాల మేరకు ఉమ్మడి జిల్లాలోని కోర్టులఆధునీకరణ తో పాటుగా  మౌలిక సదుపాయాలు కల్పన  యిప్పటినుండే కసరత్తు తోపాటు  అవసరమైన ప్రణాళికతో ముందుకు పోవాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు ఆదివారం ఉదయం జిల్లా కోర్టుప్రాంగణం లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా కోర్ట్ లతో పాటుగా జిల్లా కోర్టు లో కనీస వసతుల విస్తరణ పై ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కోర్టు భవిష్యత్తులో 10 కోర్టుల వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉండవచ్చునని అందుకు తగ్గట్టుగా భవన నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలు కోసం అవసరమైన స్థలం అవసరం ఉంటుందని ఇప్పటి నుండే కావలసిన  స్థలం కోసం సిద్ధం చేసుకోవాలన్నారు ఈ ప్రక్రియకు ఆయా శాఖల సహకారం   అందించాలని కోరారు ప్రస్తుతం ఉన్న కోర్టు ఆవరణలో సుందరీకరణ మెయింటినెన్స్ తదితర పనులను చేపట్టాలని బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు ఉద్యోగులకు న్యాయా ర్తులకు   ఆధునిక అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా  కోర్టు వచ్చే మహిళలతో పాటుగా మహిళా ఉద్యోగుల పట్ల   ప్రత్యేక శ్రద్ధ తో వసతుల కల్పనకు కృషి చేయాలని ఆన్నారు ఉమ్మడి జిల్లా కోర్టుల అభివృద్ధిలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ తమ వంతు బాధ్యతతో  పాటుగాపూర్తి సహకారం అందించవలసిన అవసరం ఎంతో ఉందన్నారు కోర్టుకు వచ్చే వారు న్యాయవాదులకు బుక్ స్టాల్ ఏటీఎం గ్రంథాలయం వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ రైల్వే సహకారంతో మరిన్ని సేవలు పొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా  జిల్లా కోర్టు అవరనలో గల  పరిసరాలను తిరిగి పరిశీలించారు ప్రతి కోర్టు రికార్డు గది  తనిఖీ చేశారు. అర్ అండ్ బి అధికారులతో  అవసరమైన భవనాలను ఆధునీకరించాలని పురాతన భవనల స్థానంలో కొత్త భవన నిర్మాణాలు  చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు  న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి  కృషి చేయాలన్నారు
బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జ్ పోస్టులను భర్తీ చేయాలని అవినీతి  నిరోధక కోర్టును ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ మెమోరాండం అందజేశారు.
 జిల్లా సెషన్ జడ్జి శ్రీమతి శ్రీ సుధ మాట్లాడుతూ కోర్టు ఆవరణలో మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులు అవసరమవుతాయని అందుకు ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేయాలని హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ను కోరారు  భవిష్యత్తులో కోర్టు విస్తరణ జరిగే అవకాశం ఉన్నందున కావలసిన స్థలం కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తామని చెప్తారు చీఫ్ జస్టిస్ సూచించిన మేరకు కోర్టుల అభివృద్ధికి అన్ని శాఖలు సహకారం తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు మాట్లాడుతూ జిల్లా కోర్టు ఆధునీకరణ అభివృద్ధి వసతుల కోసం  తన వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు చీఫ్ జస్టిస్ సూచన మేరకు భవిష్యత్ అవసరాల కొరకు ప్రభుత్వ నిబంధన మేరకు కావలసిన స్థల సేకరణ ను ఎలాంటి జాప్యం లేకుండా  సత్వరమే అందించుటకు కృషి చేస్తానని చెప్పారు కోర్టు ఆవరణలో సుందరీకరణ కొరకు ఫారెస్ట్ నగరపాలక సంస్థ ఆర్ అండ్ బి శాఖల సమన్వయంతో పూర్తిచేస్తామని చెప్పారు భవన నిర్మాణ మెయింటెనెన్స్ మరమ్మతులు పునరుద్దరణ  ఇతరాత్ర పనులను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు
జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కార్తికేయ సాధారణ ప్రజలకు కూడా మరిన్ని సేవలను అందించేందుకు కృషి చేస్తామని పోలీస్ స్టేషన్ లో  మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని కోర్టు వద్ద  పటిష్టమైన సెక్యూరిటీ చర్యలు తీసుకుంటామని చీఫ్ జస్టిస్ సూచించిన విధంగా వ్యవస్త్రికృత మార్పులను  పాజిటివ్  దృక్పథంతో పూర్తిచేస్తామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ సంతోష్ రెడ్డి, హై కోర్ట్ రిజిస్ట్రార్  జడ్జీలు కామారెడ్డి జిల్లా  ఎస్పి శ్వేత రెడ్డి  బార్  అసోసియేషన్  సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా  జడ్జి, న్యాయవాదులతో హైకోర్టు జడ్జి

హైకోర్టు జడ్జికి స్వాగతం పలుకుతున్న సీపీ కార్తికేయ

సమావేవంలోపాల్గొన్న అధికారులు

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్

No comments:

Post a Comment