Sunday, 5 May 2019

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

నిజామాబాద్‌‌ వార్త: భిక్కనూరు మండలం కాచాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైండ్ల శ్రీకాంత్‌(25) విద్యుత్తు మరమ్మతుల పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం గ్రామ శివారులో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్తు సమస్య ఉందని గ్రామ లైన్‌మెన్‌ బాబు చెప్పగా ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించేందుకు అక్కడకి వెళ్లారు. విద్యుత్తు సరఫరా నిలిపివేయకుండా స్తంభాన్ని ఎక్కడంతో విద్యుదాఘాతంతో శ్రీకాంత్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్తు సరఫరా నిలిపివేయనందువలనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment