Monday, 6 May 2019

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టమా..?

నిజామాబాద్‌‌ వార్త: అక్షయతృతీయ రోజున ఉన్నవారైనా.. లేనివారైనా సరే ఎంతోకొంత పసిడిని తీసుకుని ఆనందపడుతుంటారు. ఇలా చేస్తే సిరిసంపదలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు. కాస్త డబ్బున్నవారు చిన్న ఆభరణమో.. పెద్ద ఆభరణమో తీసుకుంటే లేనివారు ముక్కుపుడకైనా తీసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
అక్షయ తృతీయ వస్తే చాలు బంగారం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఉన్నవారైనా.. లేనివారైనా సరే ఎంతోకొంత పసిడిని తీసుకుని ఆనందపడుతుంటారు. ఇలా చేస్తే సిరిసంపదలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు. కాస్త డబ్బున్నవారు చిన్న ఆభరణమో.. పెద్ద ఆభరణమో తీసుకుంటే లేనివారు ముక్కుపుడకైనా తీసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే.. నిజంగా ఆ రోజున బంగారం తీసుకోవాలనే ఎక్కడైనా ఉందా అంటే.. అలాంటి ఆచారాలు పురాణాల్లో ఎక్కడా కూడా లేవని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.
అక్షయం అంటే క్షయం లేకుండా ఉండాలని అర్థం.. అంతేకానీ.. ఆరోజున బంగారం కొని తీరాలని ఏ ధర్మశాస్త్రాలు చెప్పలేరని పండితులు అంటున్నారు. నిజం చేప్పాలంటే ఈ రోజు దానాలు చేస్తే మంచిది అని చెబుతున్నారు. ఈ ఆచారం ఎలా వచ్చిందో కూడా తెలియదని.. కొన్ని ఏళ్లుగా ఈ సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు..
అయితే, బంగారం కొనడం అనేది మన ఆర్థికస్థోమతకు సంబంధించిన విషయం. అంతేకానీ.. ఆచారం కాదు.. బంగారం లక్ష్మీ దేవి స్వరూపమే అయినప్పటికీ ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలన్న నియమమేం లేదని చెబుతున్నారు.


No comments:

Post a Comment