Wednesday, 8 May 2019

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు పక్కాగా ఉండాలి - కలెక్టర్

నిజామాబాద్ వార్త:  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి  బ్యాలెట్  బాక్సులు భద్రపరిచిన గదుల వద్ద గట్టి బందోబస్తు ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన స్థానిక నిర్మల హృదయ పాఠశాలలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను పరిశీలించారు.స్ట్రాంగ్ రూములు ఉన్న అంతస్తులలో గన్మెన్లను ఏర్పాటు చేయాలని 24 గంటలు  నిశిత పరిశీలన ఉండేలా చూడాలన్నారు. విజిటర్స్ రిజిస్టర్లో  గుర్తింపు కార్డులు ఉన్నవారిని అనుమతించాలని తెలిపారు. రిజిస్టర్లో వారి వివరాలను నమోదు చేయించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయానికల్లా అన్ని కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు, రావడానికి, వెళ్లడానికి వేరు వేరు దారులకు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అవసరమైన సమాచారం అందించడానికి ల్యాండ్ ఫోన్ తో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సీఈవో for వేణును ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేసి  అందరూ వాటిని ప్రదర్శించేలా చూడాలన్నారు.

స్ట్రాంగ్‌‌ రూంను పరిశీలిస్తున్న కలెక్టర్‌‌

అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న కలెక్టర్‌‌

No comments:

Post a Comment