Monday, 6 May 2019

విషాదం: ప్రముఖ తెలుగు నటి సురేఖావాణి భర్త మృతి

నిజామాబాద్‌‌ వార్త: ప్రముఖ తెలుగు నటి సురేఖావాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త సురేష్ తేజ్ సోమవారం అనారోగ్యంతో మరణించారు. టీవీ షోల దర్శుడైన సురేష్ కొంతకాలంగా అనాగ్యంతో బాధ పడుతున్నారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం కన్నుమూశారు. సురేష్ తేజ్‌కు తెలుగు టీవీ, సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సురేఖవాణి ఇంటికి చేరుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
సురేష్ తేజ్ గుండె పోటు గురై మరణించినట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా గుండె సంబంధి వ్యాధితో బాధ పడుతున్నారు. కొంతకాలంగా ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటూ మెడిసిన్ వాడుతున్నట్లు తెలుస్తోంది. సురేఖావాణి, సురేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ గతంలో టీవీ రంగంలో తమ కెరీర్ మొదలు పెట్టారు. సురేఖ టీవీ యాంకర్ అయ్యాక ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని, ఆపై వివాహం చేసుకున్నట్లు సమాచారం. మాటీవీలో యాంకర్ సురేఖ వాణి పని చేసిన 'మాటాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' లాంటి షోలకు దర్శకత్వం వహించింది సురేష్ తేజ్ కావడం గమనార్హం.


No comments:

Post a Comment