Monday, 6 May 2019

పోలింగ్ ప్రశాంతం = కలెక్టర్

నిజామాబాద్‌‌ వార్త:  నిజామాబాద్ డివిజన్లో జడ్ పి టి సి,ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ శ్రీ  ఎం ఆర్ ఎం రావు తెలిపారు.

నిజామాబాద్ డివిజన్లో జెడ్ పి టి సి, ఎం పి టి సి ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని  తెలిపారు. 8  జడ్పిటిసిలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా ఏడు జడ్పిటిసి లకు, 100 ఎంపీటీసీలకు గాను ఆరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా 94 ఎంపీటీసీ లకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఉదయం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం  డివిజన్లోని పలు పోలింగ్ కేంద్రాలలో పర్యటించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన సలహాలు ఆదేశాలు జారీ చేశారు.  ధర్మారం, ఇందల్వాయి, తిర్మన్పల్లి, హొన్నాజిపేట్, సిరికొండ, ధర్పల్లి, గడు కోల్,మోపాల్  మాక్లూర్, jannepally, నవీపేట్ పోలింగ్ కేంద్రాలలో ఆయన పర్యటించి పోలింగ్ సరళిని గమనించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పర్యటన సందర్భంగా ఓటింగ్ పర్సంటేజ్ గురించి తెలుసుకున్నారు..ఏ విధంగా జరుగుతుందో నమోదు చేస్తున్న వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రిసెప్షన్ కేంద్రాలకు చేరేలా చూడాలని  చట్టబద్ధ కవర్లను ఇతర కవర్లను వేరువేరుగా సీల్ చేయాలన్నారు.పిఓ అధికారి డైరీ ని తప్పనిసరిగా జత చేయాలన్నారు. పోలింగ్ సామాగ్రిని, ఇతర వివరాలను, బ్యాలెట్ బాక్సులను అప్పగించి అంతవరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.

పోలింగ్ ఎటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా, ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు, అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు అందరి కృషి ఉందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఆయన అన్నారు.




No comments:

Post a Comment