Saturday, 4 May 2019

రంజాన్ సందర్భంగా ఇబ్బందులు రాకుండా చూడండి -- కలెక్టర్

నిజామాబాద్ వార్త: పండుగ సందర్భంగా ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అధికారులను ఆదేశించారు.

శనివారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో రంజాన్ ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ ఎండాకాలంలో వస్తున్నందున ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మసీదు వద్ద  పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీరు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు వారి సమయానికి  అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముఖ్య సమయాల్లో విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందించే ఆహార వస్తువుల లో కల్తీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పండుగకు చివరి పది రోజులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.  ముస్లిం ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాట్లు చేసి శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలన్నారు. పండుగ సందర్భంగా సెలవురోజుల్లోనూ, రాత్రి సమయాల్లో దుకాణాలు తెరిచి ఉండే అవకాశం ఉన్నందున ఆ దిశగా ఎవరికి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారూ. ఈద్గాల వద్ద ప్రార్థనలకు అనుకూలంగా సంబంధిత కమిటీల సహకారంతో ప్రార్థనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సౌండ్ సిస్టం, త్రాగునీరు కార్యక్రమాలు చూడాలన్నారు. పండుగ రోజుల్లో  ఉదయం పూట నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్  వెంకటేశ్వర్లు, డిఆర్ఓ  అంజయ్య, ఆర్డివోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, గోపి రామ్, నిజాంబాద్ ఎసిపి శ్రీనివాస్ కుమార్,  డి పి ఓ జయసుధ, జిల్లా వైద్య శాఖ అధికారి సుదర్శన్, పౌరసరఫరాల అధికారి కృష్ణ ప్రసాద్, మార్కెటింగ్ ఏడి రియాజ్, విద్యుత్ శాఖ డీఇ ముక్తార్, నిజాంబాద్ మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్ , ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అదికారులతో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment