Tuesday, 7 May 2019

భూ రికార్డుల ప్రక్షాళన లో నిర్లక్ష్యానికి విఆర్ఓ సస్పెన్షన్

నిజామాబాద్ వార్త:  భూ రికార్డుల ప్రక్షాళన లో భాగంగా  రైతుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించినందుకుగాను ఆర్మూర్ మండలం surbiryal గ్రామ వి ఆర్ ఓ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు ఆదేశాలు జారీ చేశారు.
భూ రికార్డుల ప్రక్షాళన చేసి తమ పట్టాదార్ పాసు పుస్తకాలు అంద చేయవలసిందిగా ఆ గ్రామానికి చెందిన రామ్ రెడ్డి, పల్లె సరోజన,  జక్కా లింగారెడ్డి రైతులు వి ఆర్ వో కు దరఖాస్తు చేసుకోగా ఆయన నిర్లక్ష్యంతో సమస్యను పరిష్కరించలేదని లంచం కూడా డిమాండ్ చేసినట్లు ఆర్మూర్ ఆర్ డి ఓ అందజేసిన ఎంక్వయిరీ నివేదిక లోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య కూడా తన కొత్త పాస్ పుస్తకం కొరకు Rs. 2,500 ఇచ్చినా కూడా అతను పని చేయలేదని సస్పెన్షన్ ఆదేశాలలో పేర్కొన్నారు. అందువల్ల  విధుల పట్ల నిర్లక్ష్యం, పనులు చేయడానికి లంచం అడగడం తదితర ఆరోపణలతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment