Tuesday, 7 May 2019

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ వార్త:  మొదటి విడత స్థానిక సంస్థలకు నిజామాబాద్  డివిజన్ లో జరిగిన ఎన్నికలకు  సంబంధించి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం లను కలెక్టర్ పరిశీలించారు.
మంగళ వారం ఆయన స్థానిక నిర్మల హృదయ బాలికల విద్యా సంస్థలో పర్యటించారు. ఈనెల 6న జిల్లాలోని నిజామాబాద్ డివిజన్లో జరిగిన 7 జడ్పిటిసి, 94 ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని, బ్యాలెట్ బాక్సులను ఈ పాఠశాలలో భద్రపరిచారు. ఆయా మండలాల వారీగా వేరు చేసి గదులకు సీలు వేసిన విషయాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లా పరిషత్ సీఈఓ వేణు, అదనపు సీఈవో గోవిందు, AO  కృష్ణమూర్తి లకు అవసరమైన  తదుపరి ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని వారిని లోపలికి అనుమతించవద్దని తెలిపారు. గేటు వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 27న వీటి లెక్కింపు ఉన్నందున ఆ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, కౌంటింగ్ హాల్ లను సిద్ధం చేసుకోవాలని, ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. రిజిస్టర్లో ఆయన పర్యటించినట్లు సంతకం చేశారు.
స్ట్రాంగ్‌‌ రూంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

స్ట్రాంగ్‌‌ రూంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment