Saturday, 4 May 2019

మొదటి దఫా ఎన్నికలకు ర్యాండమైజేషన్‌‌ పూర్తి: కలెక్టర్‌‌

నిజామాబాద్‌‌ వార్త:  మొదటి విడత లో జరుగు నిజాంబాద్ డివిజన్ ఎంపీటీసీ జెడ్ పి టి సి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది ర్యాం డ మైజెషన్ (నియామక) ప్రక్రియ జిల్లా పరిశీలకులు శ్రీమతి అభిలాష్ బిస్ట్టు సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు పూర్తి చేశారు మొదటి విడత చివరి ర్యాం డ మైజేష న్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత నిజాంబాద్ డివిజన్లో 8 జడ్పిటిసి లకు ఎంపీటీసీ లకు ఎన్నికలు నిర్వహణ కోసం 538 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు 117 పోలింగ్ కేంద్రాలు 400 లోపు ఓటర్లు గలరని 421 పోలింగ్ కేంద్రాల్లో 400 పైబడి ఓటర్లు ఉన్నారని 400 లోపు  ఓటర్ల గల 117 పోలింగ్ కేంద్రాలలో ఒక పి ఓ ఒక ఏపీఓ తో పాటుగా మరో ముగ్గురు పోలింగ్ సిబ్బంది ని 400 పైబడిన ఓటర్లు గల 421 పోలింగ్ కేంద్రాలలో ఒక పి ఓ ఒక ఏపీఓ మరో నలుగురు పోలింగ్ సిబ్బంది చొప్పున నియమించినట్టు కలెక్టర్ వివరించారు  అదనంగా 20 శాతం కలుపుకొని 646 పి వో లు మరో 646 ఏ పీ ఓ లు 1684 పోలింగ్ సిబ్బంది నియమించినట్లు జిల్లా కలెక్టర్ పరిశీలకులకు వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీ వేణు డిప్యూటీ సీఈఓ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ర్యాండమైజేషన్‌‌లో పాల్గొన్న ఎన్నికల పరిశీలకురాలు అభిలాష్‌‌ బిస్టు, కామారెడ్డి, నిజామాబాద్‌‌జిల్లా కలెక్టర్‌‌లు సత్యనారాయణ, రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment