Monday, 6 May 2019

ఈ నెల 7న బసవేశ్వర జయంతి - కలెక్టర్

 నిజామాబాద్‌‌ వార్త: మహాత్మ  బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని ఈనెల నెల 7న జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు ఒక ప్రకటనలో తెలిపారు.

   ఈ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో  7  తేదీ మంగళవారం ఉదయం 10:30 కి నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా  వీరశైవ లింగాయతులు, వారి సంబంధిత వర్గాల వారు, అభిమానులు ఆసక్తి కలవారు జిల్లా అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నియమావళి ప్రకారం  మాత్రమే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment