Saturday, 4 May 2019

7న అక్షయ తృతీయ ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌‌ వార్త: అక్షయ తృతీయ రోహిణి నక్షత్రము మే7 మంగళవారం ఉదయం నుండి శ్రీ లక్ష్మీకుబేర స్వామి దేవాలయం నాగారంలో అక్షయ తృతీయను  పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని దేవాలయ అధక్షురాలు అనంతలక్ష్మి తెలిపారు. శనివారం నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. లక్ష్మీదేవి సంపదలకు అధిపతిగా  పూజిస్తామని, కుబేరస్వామి అష్టనిధులకు అధిపతి అయిన రోజు అక్షయ తృతీయ నక్షత్రము ధనాధిపతి అయిన కుబేరస్వామిని పూజించడం వలన, దర్శించుకోవడం వలన అష్టైశ్వర్యములు, సిరిసంపదలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకమన్నారు. దేవాలయంలో కుబేర ముగ్గుతో ప్రారంభము, అభిషేకాలు, అర్చణలు, కుబేరస్వామి పూజలు, కుంకమ పూజలు, నక్షత్ర హారతి మంగళహారతులు తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గోవరాజు అనంతలక్ష్మి, దేవాలయం అధ్యక్షురాలు పద్మరత్న గుజ్జరాజేశ్వరి, రంజిత్‌‌, సౌజన్య, జి.ధనలక్ష్మి, ప్రమీల, ప్రశాంతి, లక్ష్మీ, సంతోష్‌‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment