Monday, 6 May 2019

మంటల్లో కాలిపోయిన 60 108 అంబులెన్స్‌లు

నిజామాబాద్‌‌ వార్త: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 108 వాహనాల సర్వీస్‌ కార్యాలయం ఆవరణలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దేవరయంజాల్‌లో పాత 108 వాహనాలు కాలిబూడిదయ్యాయి. మంటల్లో 60 అంబులెన్స్‌లు కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.


No comments:

Post a Comment