Monday, 29 April 2019

పుస్తకాల బ్యాగు బరువు మోత నుంచి విద్యార్థులకు విముక్తి కలిగించాలి

‒ పీడీఎస్‌‌యూ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌‌ కల్పననిజామాబాద్‌‌ వార్త : 
తెలంగాణ రాష్ట్రంలో  విద్యార్థులు పుస్తకాల బరువును మోయలేక మానసికంగా, శారీరకంగా ఇబ్బందిపడుతున్నారని, వెంటనే వారికి పుస్తకాల బరువు మోత నుంచి విముక్తి కలిగించాలని పీడీఎస్‌‌యూ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌‌. కల్పన కోరారు. ఈమేరకు జిల్లా పీడీఎస్‌‌యూ ఆధ్వర్యంలో ఆమె సోమవారం డీఈవో దుర్గాప్రసాద్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చిన్న వయస్సులోనే  విద్యార్థులపై మోయలేని పుస్తకాల బ్యాగు బరువులతో విద్యార్థి జీవితాలతో ఆడుకొంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీని ఫలితంగా విద్యార్థుల శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం  పడుతుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఏ తరగతి విద్యార్థికి ఎంతటి బరువు పుస్తకాలు ఉండాలి అనే నిబంధనలు పెట్టినప్పటికీ మన రాష్ట్రంలో ఆ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం  విద్యార్థుల  పుస్తకాల బ్యాగు బరువు మోత భారం తప్పించాలని ఆమె డిమాండ్‌‌ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ఖచ్చితంగా ఈ నిబంధనలు అమలు చేసి విద్యార్థులకు అధిక బరువు బ్యాగుల నుంచి విముక్తి కలిగించాలని కోరారు. లేనియెడల పీడీఎస్‌‌యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.  డీఈవోకు వినతిపత్రం ఇచ్చిన వారిలో పీడీఎస్‌‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌‌.గౌతం కుమార్‌, పీడీఎస్‌‌యూ నాయకులు సాయికృష్ణ, సంగీత, సౌజన్యలు ఉన్నారు.

డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న పీడీఎస్‌‌యూ నాయకులు

No comments:

Post a Comment