Tuesday, 2 April 2019

ఇందూరు యువత సేవలు ప్రశంసనీయం

ఎంపీ కల్వకుంట్ల కవిత

ఇందూరు యూత్‌‌ అసోసియేషన్‌‌ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, సమాజానికి మీలాంటి యువత ఆదర్శం కావాలని నిజామాబాద్‌‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందూరు యువత అసోసియేషన్‌‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గురించి తెలుసుకున్న ఆమె మంగళవారం ఇందూరు యువత అసోసియేషన్‌‌ సభ్యులను తన పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత 8 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాల డాక్యుమెంటరీని పరిశీలించారు. సేవా కార్యక్రమాల వివరాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిబాబు ఎంపీ, అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌గుప్త లకు వివరించారు. ఎంపీ సంస్థ భవిష్యత్‌‌ సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఏప్రిల్‌‌ నెలలో నిర్వహించే సంస్థ 8వ వార్షికోత్సవానికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఇందూరు యువత అసోసియేషన్‌‌ రెండు సార్లు రాష్ట్ర స్థాయి బెస్ట్‌‌ యూత్ అవార్డు, బెస్ట్‌‌ అక్చివ్‌‌మెంట్‌‌ అవార్డ్సు అందుకోవడం పట్ల ఆమె హర్శం వ్యక్తం చేశారు. కవితను కలిసిన వారిలో ఇందూరు యూత్‌‌ అసోసియేషన్‌‌ కార్యదర్శి ఎ.ప్రసాద్‌‌, ప్రధాన కార్యదర్శి సుభాష్‌‌ పద్మ, కోశాధికారి సతీష్‌‌గౌడ్‌‌, భాస్కర్‌‌, పోచయ్య, శ్రావణ్‌‌ తదితరులు ఉన్నారు.

ఎంపీ కవితకు పుష్పగుచ్చం అందజేస్తున్న ఇందూరు యూత్‌‌ అసోసియేషన్‌‌ సభ్యలు

No comments:

Post a Comment