Monday, 29 April 2019

కలెక్టరేట్‌‌ ఎదుట జేఎల్‌ఎం‌ అభ్యర్థుల భిక్షాటన

నిజామాబాద్‌‌ వార్త: అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ అభ్యర్థులు సోమవారం కలెక్టరేట్‌‌ ఎదుట భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనవరి 19న జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ పోల్‌‌ టెస్ట్‌‌ సందర్భంగా తీసుకున్న ఒరిజినల్‌‌ సర్టిఫికెట్స్‌‌ను అధికారులు ఇప్పటి వరకు ఇవ్వలేదని, దీంతో వేరే ఏ ఇతర ఉద్యోగాలు అప్లై చేయడానికి కాని, ఉద్యోగం చేయడానికి కానీ వీలు లేకుండా పోయిందన్నారు. దీంతో ఏ ఉద్యోగం లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్నామన్నారు. జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ ఉద్యోగానికి ప్రభుత్వం ఫిబ్రవరి‒2018లో  నోటిఫికేషన్‌‌ ఇవ్వగా, ఏప్రిల్‌‌‒2018లో పరీక్ష నిర్వహించిందన్నారు. జనవరి ‒2019లో పోల్‌‌టెస్ట్‌‌కోసం 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచారన్నారు. అయితే అప్పుడు తీసుకొన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్‌‌ ఇప్పటి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్‌‌ వెంటనే స్పందించి మా ఒరిజినల్‌‌ సర్టిఫికెట్స్‌‌ వెంటనే ఇప్పించాలని కోరారు.  అలాగే పోల్‌‌టెస్టులో ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌‌లిస్టు త్వరగా ప్రకటించాలని,  జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఎల్‌‌ఎమ్‌‌ అభ్యర్థులు ఖదీర్‌‌, సాయికృష్ణ, అనిత్, రవి నాయక్‌‌, జాదవ్‌‌ ఈశ్వర్‌‌, మురళీధర్‌‌, నరేష్‌‌, పొన్న రవి, నాగరాజు, సురేష్‌‌, మహేష్‌‌, కమలాకర్‌‌ తదితరులు పాల్గొన్నారు.

భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న జేఎల్‌‌ఎం అభ్యర్థులు

No comments:

Post a Comment