Monday, 1 April 2019

రోటరీ క్లబ్‌‌ ఆధ్వర్యంలో కృత్రిమ చేతి శిబిరం

 మహారాష్ట్రకు చెందిన రోటరీ క్లబ్‌‌ ఆఫ్‌‌ పూణే‌, తెలంగాణకు చెందిన రోటరీక్లబ్‌‌ ఆఫ్‌‌ నిజామాబాద్‌‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం  కృత్రిమ చేయి ఎల్‌‌ఎన్‌‌‒4 చేతి శిబిరాన్ని ఏర్పాటు చేశారు.   ఈ శిబిరంలో   6 జిల్లాల నుంచి 250 మంది పేర్లు నమోదు చేసుకోగా 12 మందికి ఎల్‌‌.ఎన్‌‌‒4 కృత్రిమ చేయిని అమర్చినట్లు తెలంగాణ రోటరీ క్లబ్‌‌ బాద్యులు రాజ్‌‌కుమార్ సుబేదార్‌‌ తెలిపారు. కార్యక్రమంలో జాల్నాకి చెందిన ప్రముఖ సామాజిక వేత్త విక్రం, సంస్థ చైర్మన్‌‌ రమేష్‌‌ భాయ్‌‌, పూణెకు చెందిన ప్రదీప్‌‌, షబ్బీర్‌‌, తెలంగాణ క్లబ్‌‌ బాద్యులు రాజ్‌‌కుమార్ సుబేదార్‌‌, జితేంద్ర, జల్నా క్లబ్‌‌ అధ్యక్షుడు డాక్టర్‌‌ స్వప్నిల్‌‌ తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ చేతును అమర్చుతున్న వైద్యులు

కృత్రిమ చేతి అమర్చిన వారితో రోటరీక్లబ్‌‌ బాద్యలు

No comments:

Post a Comment