Monday, 1 April 2019

లోక్‌‌సభ ఎన్నికలకు ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలి


‒ జాయింట్‌‌ కలెక్టర్‌‌ ఎం.వెంకటేశ్వర్లు

నిజామాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు: లోకసభ ఎన్నికల పోలింగ్‌‌కు  ముందస్తు అన్ని ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్  ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో ఏఆర్ఓ లు,  నోడల్ అధికారులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి రెండో దశ శిక్షణ తరగతులను అదేవిధంగా అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలన్నారు.  బీయూ ల సంఖ్య పెరగనున్నందున ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చే బీయూలు,  సీయూలు, వి.వి ప్యాట్లు  చెకింగ్ తదితర  పనులను వేగవంతంగా పూర్తి చేసి పోలింగ్ కు సిద్ధంగా ఉండాలని  నోడల్ అధికారులకు సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మరో సారి భౌతికంగా పరిశీలన చేసి నివేదికను  రెండు రోజుల్లో అందజేయాలని ఏఆర్ఓ లను ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జాన్ శాంసన్, ఆర్మూర్ నిజామాబాద్ ఆర్టీవోలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అధికారులు డి.వి. రెడ్డి, చతుర్వేది,  స్రవంతి, మహమ్మద్ ముర్తుజా, ఉదయ్ ప్రకాష్, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్లు

No comments:

Post a Comment