Tuesday, 2 April 2019

‘విజయ సంకల్పం’తో కమల దళంలో నూతనోత్సాహం

 ఏప్రిల్‌‌ 11న జరగబోయే పార్లమెంట్‌‌ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగా తమ అధినాయకులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌‌ మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభకు కేంద్ర హోమంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సభకు భారీగా జనం తరలివచ్చారు. పాలిటెక్నిక్‌‌ గ్రౌండ్‌‌ మైదానం పూర్తిగా జనంతో నిండిపోయింది. జనాలకు ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. ఆశించిన స్థాయికంటే ఎక్కువ మంది రావడంతో షామియా అవతల కూడా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎండా కాలం కావడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి ప్యాకెట్లను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌ మాట్లాడుతుండగా షాట్‌‌సర్క్యూట్‌‌ జరిగి సభా ప్రాంగణం పక్కనే మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఫైర్‌‌టీం వాటిని ఆర్పివేశాయి. ఈ సందర్భంలో సభలో కొంత గందరగోళం నెలకొంది. సభ ప్రారంభానికి ముందు నిజామాబాద్‌‌ రూరల్‌‌ నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీ చేసిన ప్రదీప్‌‌రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. ధర్మపురి అరవింద్‌‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా నేతలు యెండల లక్ష్మినారాయణ, అల్జాపూర్‌, పార్లమెంట్‌‌‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌‌ ‌ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోమంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అలాగే అక్కడ డక్కడ ఆయన టీఆర్‌‌ఎస్‌‌ పట్ల వ్యంగ్యంగా మాట్లాడటంతో సభలో నవ్వులు విరబూసాయి. మొత్తంగా సభ సక్సెస్‌‌ కావడంతో బీజేపీ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.

ఆకట్టుకొన్న సాంస్కృతిక కార్యక్రమాలు

బీజేపీ విజయ సంకల్ప సభ ప్రారంభంలో కళాకారుల నృత్యాలు.. పాటలు ప్రజలను అలరించాయి. ముఖ్యంగా నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌‌ గురించి పాడిన పాట బాగా జనాలను ఆకట్టుకొంది. కళాకారుల నృత్యాలు అబ్బురపరిచాయి.

కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, బీజేపీ సీనియర్‌‌ నాయకులు అల్జాపూర్‌‌ శ్రీనివాస్‌‌, లోక భూపతిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యడు ధనపాల్‌‌ సూర్యనారాయణ గుప్త, లక్ష్మినర్సయ్య, జహీరాబాద్‌‌ పార్లమెంట్‌‌ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, బాల్‌‌రాజ్‌‌, టక్కర్‌‌ హన్మంత్‌‌రెడ్డి, నర్సింహారెడ్డి, బద్దం లింగారెడ్డి, ఆర్మూర్‌‌ అసెంబ్లీ అభ్యర్థి వినయ్‌‌కుమార్‌‌రెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్‌‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూర్‌‌ శ్రీనివాస్‌‌, హెచ్‌‌.సుభాష్‌‌, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బి.భాస్కర్‌‌, జగిత్యాల రవీందర్‌‌రెడ్డి, డాక్టర్‌‌ వెంకటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదూరి అరుణ, మోరెపల్లి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌‌, అసెంబ్లీ కన్వీనర్‌‌ గజం ఎల్లప్ప, కె.పి.రెడ్డి యాదవ్‌‌, నిజామాబాద్‌‌ మున్సిపల్‌‌ ఫ్లోర్‌‌ లీడర్‌‌ న్యాలం సునీత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment