Monday, 29 April 2019

జగధీశ్వర్‌‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి

 నిజామాబాద్‌‌ వార్త:  చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇంటర్‌‌ ఫలితాలలో అవకతవకలు జరిగి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని,  విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగధీశ్వర్‌‌‌రెడ్డిని మంత్రివర్గంలో నుంచి వెంటనే  తొలగించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ గుప్త అన్నారు. సోమవారం బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఏప్రిల్‌‌ 18న విడుదల చేసిన ఇంటర్‌‌ ఫలితాలలో అవకతవకలతో ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కేసీఆర్‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,   దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.  విద్యార్థుల పట్ల నిలిచిన పలు రాజకీయ పార్టీ నాయకులను, విద్యార్థి నాయకులను ధర్నాలు చేయకుండా ముందస్తు అరెస్టులు చేయడం, హౌస్‌‌ అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అనంతరం బీజేపీ, బీజేవైఎం నాయకులు జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌‌, బీజేవైఎం నగర అధ్యక్షుడు రోణన్‌‌లాల్‌‌బోరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతుల రవి, కరిపె గణేష్‌‌, చైతన్య కులకర్ణి, యెండల సురేష్‌‌, శీల శ్రీనివాస్‌‌, ఆకుల శ్రీనివాస్‌‌, శ్రీకాంత్‌‌, పోలీస్‌‌ శ్రీనివాస్‌‌, వనజ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేవైఎం, బీజేపీ నాయకులు

జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇస్తున్న బీజేపీ నాయకులు

No comments:

Post a Comment