Monday, 29 April 2019

సీఎస్‌‌ఐ పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

నిజామాబాద్‌‌ వార్త: తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన క్లాస్‌‌మేట్‌‌ కుటుంబానికి  జిల్లా కేంద్రంలోని సీఎస్‌‌ఐ 1992‒93 బ్యాచ్‌‌ పూర్వ విద్యార్థులు సోమవారం రూ.50 వేల ఆర్థిక సాయం  అందజేశారు. ఈ సందర్బంగా సీఎస్‌‌ఐ 1992‒93 బ్యాచ్‌‌ పూర్వ విద్యార్థి పి.రాజేందర్‌‌ మాట్లాడుతూ  జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌‌ చార్మినార్‌‌ గుట్టలో నివాసం ఉంటున్న మా క్లాస్‌‌మేట్‌‌ జి.రాజు ఇటీవల కిడ్నీ వ్యాదితో మృతిచెందాడని,  అతని భార్య సంవత్సరం క్రితం లివర్‌‌ సంబంధ వ్యాదితో మృతిచెందిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధతో అతని కుమారుడు, కూతురు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయం మమ్మల్ని కలచివేసిందని, అందుకే అందరం కలిసి ఈరోజు రాజు కూతురు సంజనకు రూ.50 వేల చెక్కును అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.  ధాతలెవరైనా వారి పరిస్థితిని అర్థం చేసుకొని తోచిన సాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.  వివరాలకు తన నెంబర్‌‌ 98488 10095కు ఫోన్‌‌ చేయాల్సిందిగా సూచించారు.

Add captionఆర్థిక సాయం చెక్కును అందజేస్తున్న  సీఎస్‌‌ఐ 1992‒93 ఎస్సెస్సీ బ్యాచ్‌‌ విద్యార్థులు

No comments:

Post a Comment