Tuesday, 2 April 2019

యథావిధిగా ఈవీఎంల ద్వారానే ఎంపీ ఎలెక్షన్స్‌‌

‒కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ ఎన్నికలను ఏప్రిల్‌‌ 11న ఈవీఎం ల ద్వారా యథావిధిగా నిర్వహించనున్నామని కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఎలాంటి సందేహాలు లేకుండా తప్పక వీలు చేసుకొని మీ అమూల్యమైన ఓటు వేయాలని ఆయన సూచించారు. ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఓటు వేసే విధానం ఒక్కటేనని, ఒక బ్యాలెటింగ్ యూనిట్ ( ఓటువేసే మిషన్) బదులుగా 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి అంతే తేడా అని వివరించారు. కాబట్టి ఎలాంటి భయం, సందేహాలు, సంకోచాలూ లేకుండా గత ఎన్నికలలో లాగానే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బ్యాలెట్ (ఓటు వేసేది) ఉంటె జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. ఈ బ్యాలెట్ యూనిట్లన్ని ఓటింగ్ కంపార్ట్ మెంట్లో అమర్చబడుతాయని, మనం ఓటు వేసిన తదుపరి సరిచూసుకునే వి.వి.ప్యాట్ సరిగ్గా మధ్యలో అమర్చబడుతుందని చెప్పారు. ప్రజలు తప్పక ఓటు వేసి, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.



No comments:

Post a Comment