Monday, 1 April 2019

టీఆర్‌‌ఎస్‌‌లో చేరిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

బీజేపీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాలిగం గోపాల్, ఆయన భార్య సునీత సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో టీఆర్ఎస్‌‌లో చేరారు. గోపాల్ మూడు దశాబ్దాలుగా బీజేపీ లో వివిధ పదవుల్లో పనిచేశారు. సునీత నిజామాబాద్ 11వ డివిజన్ కార్పొరేటర్. వీరితో పాటు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. రాజు గౌడ్, 11 వ డివిజన్ అధ్యక్షుడు, డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జి. నరేందర్ టీఆర్ఎస్ లో చేరారు. వీరికి ఎంపీ కవిత, అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త గులాబీ కండువ కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

కవితని గెలిపిస్తా..

నిజామాబాద్ ఎంపీగా మళ్లీ కల్వకుంట్ల కవిత ను గెలిపిస్తానని, అందుకే బీజేపీని వీడానని జాలిగం గోపాల్ తెలిపారు. టిఆర్ఎస్ అన్ని వర్గాలకు అండగా ఉంటున్నదని, సీఎం కేసీఆర్ విజన్ తో తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్నారని గోపాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టిఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, ను డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం పాల్గొన్నారు.

ఎంపీ కవిత, అర్బన్‌‌ ఎమ్మల్యే బిగాలతో టీఆర్‌‌ఎస్‌‌లో చేరిన నేతలు

No comments:

Post a Comment