Monday, 1 April 2019

బీసీల ద్రోహి.. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం


  బీసీల ద్రోహి టి.ఆర్.ఏస్  ప్రభుత్వానికి కొన్ని బీసీ సంఘాలు మద్దతు పలకడం సిగ్గుచేటని  యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంటరీ అధ్యక్షుడు పంచారెడ్డి చరణ్ అన్నారు. ఆయన సోమవారం నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్‌‌ భవన్‌‌లో జరిగిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.   దేశానికి వెన్నెముక, పట్టు కొమ్మలు అయిన గ్రామాలలో బీసీల ఆధిపత్యం లేకుండా రిజర్వేషన్ తగ్గించిన టి.ఆర్.ఎస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న బిసి నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవుపలికారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టీఆర్‌‌ఎస్‌‌ తీరని అన్యాయం చేసిందని, 33 శాతం ఉన్న బిసి రిజర్వేషన్‌‌ను 23 శాతానికి తగ్గించి గ్రామాల్లో బీసీలను  ఎదగకుండా అడ్డుకొంటున్నారని అన్నారు. శాసన సభ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అధిక స్థానాలు అగ్రవర్ణాల కు మాత్రమే  ఇచ్చారన్నారు. జనాభాలో 62 శాతానికి పైగా ఉన్న బి.సి. లకు మంత్రి పదవుల్లో సరైన స్థానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ నుంచి ఐదేళ్లుగా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని,  ముష్టివేసినట్లు రూ.లక్ష రుణాన్ని ధరఖస్తూ చేసుకుంటే రెండేళ్ల తరువాత రూ.50 వేల సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారన్నారు. లక్షకు పైగా ధరఖాస్తులు వస్తే వాటిలో 3 వేల దరఖాస్తులను మాత్రమే పరిగణలోనికి తీసుకుని మిగిలిన దరఖాస్తులను ఇంటర్వ్యూల పేరుతో కాలయాపన చేస్తున్నాయారని అన్నారు. 
 టీఆర్‌‌ఎస్‌‌కు మద్దతు తెలపాలని బీసీ సంఘాలు తీసుకున్న నిర్ణయం సామాజిక తెలంగాణ స్వప్నాన్ని తూట్లు పొడిచేలా ఉందని ఈ సందర్బంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఉహించలేమని అలాంటి గొప్ప ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర స్వప్నాన్ని సాధించుకున్న వెనకబడిన వర్గాలు ఈ రోజు టీ.ఆర్. ఎస్ ప్రభుత్వం లో రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారన్నారు. పదవుల కోసం ఆశపడి ప్రభుత్వానికి బి.సి లను తాకట్టు పెడుతున్న బి.సి నేతలారా... టీ.ఆర్.ఎస్ కు మద్దతు తెలపడంపై మరోసారి పునరాలోచించుకోవాలని  ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న కాగ్రెస్ నేత మధుయాష్కీని గెలిపించాలని, ప్రజాహితం కోసం పని చేస్తున్న కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు రాజ నరేందర్ గౌడ్, ఎన్‌‌.ఎస్.యూ.ఐ నాయకులు వేణు, నాగరాజు, సతీష్,  భాను, వేధమిత్ర తదితరులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న జిల్లా  యూత్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్‌‌

No comments:

Post a Comment