Wednesday, 17 April 2019

కార్పొరేట్‌‌ పాఠశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌‌  వార్త: నిజామాబాద్‌‌ జిల్లా బెస్ట్‌‌ అవైలేబుల్‌‌ స్కూల్‌‌ స్కీము  కింద 2019‒20 విద్యా సంవత్సరమునకు గాను నూతన కార్పొరేట్‌‌ పాఠశాలలు ఎంపిక కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తు చేసే   విద్యాసంస్థలు ఈ క్రింది సదుపాయాలు, నియమ నిబంధనలను   తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
‒ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి
‒ పాఠశాల మెడికల్‌‌ సదుపాయము కలిగి ఉండాలి
‒ పాఠశాలలో క్వాలిఫైడ్‌‌ ఉపాధ్యాయులు ఉండవలెను.
‒ పాఠశాల గత 5 సంవత్సరాలలో 10వ తరగతిలో 90% ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే 50% మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
‒ పాఠశాల ఆర్‌‌సీసీ రూఫ్‌‌, మంచి ఫ్లోరింగ్‌‌ మరియు వెంటిలేషన్‌‌ కలిగి ఉండాలి.
‒ పాఠశాలలో డార్మిటరి అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరు వేరుగా ఉండాలి.
‒ తరగతులకు, వసతి గృహమునకు సరిపడు ఫర్నీచర్‌‌ ఉండాలి.
‒ టాయ్‌‌లెట్స్‌‌, బాత్రూంలు అమ్మాయిలకు, అబ్బాయిలకు 10:1 నిష్పత్తిలో సరిపడా ఉండాలి.
‒ పాఠశాలలో మంచి భోజనము, డైనింగ్‌‌ హాల్‌‌ ఉండాలి.
‒ పాఠశాల సరిఅయిన ప్లాన్‌‌తో నిర్మించి ఉండాలి.
దరఖాస్తు ఫారము, ఇతర వివరాల కోసం జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, రెండవ అంతస్తు, ప్రగతిభవన్‌‌ నిజామాబాద్‌‌ నందు సంప్రదించాలని సూచించారు. పూరించిన దరఖాస్తు ఫారాలను తగిన దృవీకరణలతో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయము, నిజామాబాద్‌‌ నందు సమర్పించాలని చెప్పారు. 



No comments:

Post a Comment