Tuesday, 2 April 2019

ఈవీఎం సహాయ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

- కలెక్టరేట్లో ప్రజలు, పోటీ చేసే అభ్యర్థుల కొరకు ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. రామ్మోహన్‌‌ రావు పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన 12 బ్యాలెట్ యూనిట్లను, కంట్రోల్‌‌ యూనిట్‌‌, వీవీ ప్యాట్‌‌ల పనితీరును పరిశీలించారు. కేంద్రానికి సమాచారం కోసం వచ్చే ప్రజలకు, ఓటర్లకు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల అనుమతులకు అభ్యర్థులు, వారి ఏజెంట్లు కనీసం 48 గంటల ముందుగా సువిధ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలని సిబ్బందికి కలెక్టర్ తెలిపారు. కలెక్టర్‌‌ వెంట శ్రీధర్, సమాచార శాఖ డి డి ముర్తుజా ఉన్నారు.



No comments:

Post a Comment