Monday, 1 April 2019

ఎంపీగా కవితక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి

4,5 డివిజన్ల బూత్‌‌కమిటి సమావేశంలో అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల

  కేసీఆర్‌‌ తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సమక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌‌ వన్‌‌ స్థానంలో నిలిపారని నిజామాబాద్‌‌ అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త అన్నారు. ఆయన సోమవారం నగరంలోని 4,5వ డివిజన్‌‌ల బూత్‌‌ కమిటి సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌ గర్భవతుల కోసం 102 అంబులెన్స్‌‌ ప్రారంభించారని, పుట్టిన బిడ్డ కోసం కేసీఆర్ కిట్‌‌ను అందజేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లల చదువుకోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్ళి కోసం కళ్యాణలక్ష్మి, షాదీముభారక్‌‌ పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. గత కాంగ్రెస్‌‌ ప్రభుత్వం వృద్ధులకు రూ.200 పింఛన్‌‌ ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1000 రూపాయిలు ఇచ్చారని, వచ్చేనెల నుంచి దాన్ని కూడా పెంచి రూ.2016 ఇవ్వనున్నారని పేర్కొన్నారు. అలాగే వికలాంగులకోసం రూ.3016 ఇవ్వనున్నారని, నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు కరెంటు ఉంటుందన్నారు. అనేక ఏళ్ళుగా గుంతలమయంగా ఉన్న రోడ్లు నేడు బాగుపడ్డాయన్నారు. నగరంలో అభివృద్ధి మరింతగా జరగాలంటే ఎంపీ కవితను రాబోయే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్‌‌ ఆకుల సుజాత, కార్పొరేటర్లు పంచరెడ్డి నర్సుబాయి, దారం సాయిలు, భూలక్ష్మి, నీలం కిషన్‌‌ తదితరులు పాల్గొన్నారు.

40, 43,44, 47వ డివిజన్‌‌లలో...

నిజామాబాద్‌‌ నగరంలోని 40,43, 44, 47వ డివిజన్‌‌లో నిర్వహించిన బూత్‌‌కమిటి సమావేశానికి అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌గుప్త హాజరై మాట్లాడారు. గత 50 సంవత్సరాల నుంచి జరగలేని అభివృద్ధి పనులు ఈ 5 సంవత్సరాల లోపల జరిగాయన్నారు. నగరమంతా అండర్‌‌ డ్రైనేజి వ్యవస్థ, రోడ్డు వెడల్పు, నూతన కలెక్టరేట్‌‌, ఐటీ హబ్‌‌, అలాగే అనేక సంక్షేమ పథకాలతో ఈ కార్యక్రమంలో మేయర్‌‌ ఆకుల సుజాత, కార్పొరేటర్లు పంచరెడ్డి, దారం సాయిలు, సహదేవ్‌‌, శ్రీవాణి, ప్రవీన్‌‌కుమార్‌‌ గౌడ్‌‌, పేట సంతోష్‌‌, సుజిత్‌‌, సత్యప్రకాష్‌‌ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త

పాల్గొన్న  డివిజన్‌‌ ప్రజలు

No comments:

Post a Comment