Monday, 29 April 2019

చిన్న తరహా సాగునీటి వనరుల వివరాలు ఇవ్వండి:-- కలెక్టర్

నిజామాబాద్‌‌ వార్త: 

 చిన్నతరహా సాగునీటి వనరులకు సంబంధిత శాఖలు పూర్తి వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్  ఎం.రామ్మోహన్‌‌రావు అధికారులను ఆదేశించారు.  సోమవారం  తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు వేల కంటే తక్కువ ఎకరాల సాగునీటిని అందించే ప్రాజెక్టుల వివరాలను పూర్తి  సమాచారంతో అందించాలన్నారు.  వీటిలో   ఫాం పాండ్స్, డ్రిప్పులు,  పర్కులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాములతో పాటు చిన్న చెరువులకు సంబంధించిన ఆయా శాఖలు వివరాలను సిద్ధం చేయాలన్నారు.  ముఖ్యంగా డీఆర్‌‌డీవో, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ తదితర శాఖలు ఇందుకు కోసం కృషి చేయాలన్నారు.  ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వీటి సెన్సెస్ నిర్వహిస్తామని,  ఇందులో నీటి పారుదల శాఖది ముఖ్యమైన భూమిక అని తెలిపారు.  విద్యుత్ శాఖ  గ్రామాల వారిగా ఎన్ని వ్యవసాయ పంపుసెట్లు కనెక్షన్స్‌‌ ఉన్నాయో తెలపాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయని, అధికారులు భూగర్భ జలాలు పెంచడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు.
 ఈ సమావేశంలో  సీపీవో  శ్రీరాములు, డిఆర్ఓ అంజయ్య, డీఆర్‌‌డీవో  రమేష్, నీటి పారుదల శాఖ  డిప్యూటీ  ఈఈ నాగేశ్వరరావు, ఎస్‌‌ఈ దామోదర్ , మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్ , గ్రౌండ్ డీడీ  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment