Monday, 1 April 2019

సీపీని కలిసిన కోటగల్లి వాసులు

   నగరంలోని కోటగల్లివాసి అయిన తాపీమేస్త్రి సోమినేని రాజుపై ముగ్గురు రౌడీషీటర్లు శనివారం రాత్రి చేసిన దాడికి నిరసనగా కోటగల్లి వాసులు సోమవారం సీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. సదరు రౌడీషీటర్లతో కాలనీలో మహిళలు తిరగలేని పరిస్థితి నెలకొందని, ఎవరిని పడితే వారిపై దాడులకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.  అందుకు సీపీ కార్తికేయ స్పందిస్తూ కాలనీలో పోలీసుల సమావేశం ఏర్పాటు చేసి సమస్యను సత్వరమే పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కోటగల్లి నుంచి సీపీ కార్యాలయం వరకు కోటగల్లి కాలనీ వాసులు ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ఎదుట  నిరసన తెలిపారు.

సీపీకి వినతిపత్రం అందజేస్తున్న కోటగల్లి వాసులు


సీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కోటగల్లి వాసులు




No comments:

Post a Comment