Monday, 1 April 2019

ఎర్రజొన్న, పసుపు రైతులకు మద్దతు


రైతులను పట్టించుకోని ప్రభుత్వ తీరుకు నిరసనగా నామినేషన్‌‌లు వేసి లోక్‌‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ఆర్మూర్‌‌ ఎర్రజొన్న, పసుపు రైతులకు తమ పూర్తి మద్దతు ప్రటకిస్తున్నామని సీపీఐ(ఎంల్‌‌), ఎంసీపీఐ(యు), యు.సి.సి, ఆర్‌‌.ఐ(ఎం.ల్‌‌) నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు కొన్న నెలలుగా ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్‌‌లను పట్టించుకోకుండా వారిని అరెస్టు చేయించడం, వారిపై కేసులు నమోదు చేయడం సిగ్గు చేటన్నారు. రైతుల డిమాండ్‌‌లను పట్టించుకొని తక్షణమే రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంల్‌‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌‌, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకుడు నాగెల్ల కొమురయ్య, యుసీసీఆర్‌‌ఐ (ఎంఎల్) రాష్ట్ర కన్వీనర్‌‌ జి.సదానందం, సీపీఐ(ఎంల్‌‌) నాయకుడు గుంజల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

No comments:

Post a Comment