Monday, 1 April 2019

ఈనెల 4న బీసీ ఐక్య వేదిక భారీ బహిరంగ సభ


  ఈ నెల 4న  గురువారం  సాయంత్రం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బీసీ ఐక్య వేదిక భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సంఘం  గౌరవ సలహాదారులు రాజారాం యాదవ్ , జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌‌లు తెలిపారు.  జిల్లా కేంద్రంలోని  ఎంపీ క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో వారు మీడియాతో మాట్లాడారు.  బీసీలకు నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలోనే  27% శాతం రిజర్వేషన్లు రావడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ముందు కూడా బీసీలకు అభివృద్ధి ఫలాలు ఈ దేశంలో అందాలంటే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పలువురు బీసీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇంతవరకు కేంద్రంలో ఉన్న బిజెపి , కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం అని అన్నారు. బీసీ భారీ బహిరంగ సభకు  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా నాయకులు అందరూ పాల్గొంటారని తెలిపారు.జిల్లాలో ఉన్న  సుమారు యాభై బీసీ కులాలు అందరూ  ఈ భారీ బహిరంగ సభకు హాజరై సభన జయప్రదం చేయాలని కోరారు.  ప్రతి కుల నాయకులువారి వారి కుల సోదరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. మీడియా   రాజారాం, దర్శనం దేవేంద్ర , మానస గణేష్ , మహిపాల్ యాదవ్, అన్నయ్య , మాకు రవి, నారాయణ రావు, మత్స్యకార సాయిబాబ,లక్ష్మణ్ గౌడ్, మల్లేష్ యాదవ్ ,  బోనేకర్ భూమన్న, మధుసూదన్, దమ్మన్న స్వామి , కొయ్యాడ శంకర్ , పొదిల శోభ , గట్టాడి భూషణ్‌‌ , గోపి, అనిల్ , సంజీవ్, సురనార్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌‌

No comments:

Post a Comment