Saturday, 9 March 2019

ఆకట్టుకొన్న విజ్ఞాన ప్రదర్శన

 నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రం సూర్యనగర్‌‌లోని ఆదిత్య పాఠశాలలో శనివారం నిర్వహించిన విజ్ఞానప్రదర్శన ఆకట్టుకొంది.  విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు పలువురి మన్ననలు పొందాయి.  ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వ ఓం ప్రకాష్‌‌ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి, స్టేజి ఫియర్‌‌ పోగొట్టడానికి విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.





No comments:

Post a Comment