Friday, 22 March 2019

బాస్కెట్‌‌బాల్‌‌ విజేత నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల

  కాలోజి నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌‌ హెల్త్‌‌ సైన్సెస్‌‌ ( కె.ఎన్‌‌.ఆర్‌‌.యు.హెచ్‌‌.ఎస్‌‌) ఆధ్వర్యంలో వరంగల్‌‌లో నిర్వహించిన ఫైనల్‌‌ పోటీలలో  నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల బాస్కెట్‌‌బాల్‌‌ జట్టు విజేతగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్‌‌ డాక్టర్‌‌ ఇందిర తెలిపారు. శుక్రవారం వరంగల్‌‌లో జరిగిన ఫైనల్స్‌‌లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌‌తో పోటీపడిన నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల బాస్కెట్‌‌బాల్‌‌ జట్టు విజేతగా నిలిచిందన్నారు. అలాగే కాకతీయ మెడికల్‌‌ కళాశాలతో జరిగిన బాడ్మెంటన్‌‌ సెమీఫైనల్స్‌‌లో గెలిచి  నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల విద్యార్థులు రన్నర్‌‌గా నిలిచినట్లు ఆమె పేర్కొన్నారు.  విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ మెడికల్‌‌ కళాశాల ప్రిన్సిపల్‌‌ డాక్టర్‌‌ సంధ్య బహుమతులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. 



No comments:

Post a Comment