Thursday, 14 March 2019

న్యాయవాదుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఏర్పటుకు కృషి


‒ కరీంనగర్‌‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురేష్‌‌ రెంజర్ల
 జూనియర్‌‌ న్యాయవాదులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్‌‌ ఇస్తుందో దాని కంటే ఎక్కువ ఇచ్చేవిధంగా కృషిచేస్తానని అదేవిదంగా న్యాయవాదుల కొరకు ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కరీంనగర్‌‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురేష్‌‌ రెంజర్ల అన్నారు. ఆయన గురువారం నిజామాబాద్‌‌ జిల్లాకేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో మాట్లాడారు. ఉపాధి కల్పనలో పట్టభద్రులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగాల రిక్రూట్‌‌మెంట్‌‌కు కృషిచేస్తానన్నారు. కాంట్రాక్ట్‌‌ మరియు ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి తదనుగుణంగా జీతాలు చెల్లించుటకు పాటుపడతానన్నారు. రిటైర్డ్‌‌ అయిన ఉద్యోగులకు ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ నుండి మినహాయింపు ఉండేందుకు కృషిచేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ  ఇచ్చారు. పట్టభద్రులందరూ ఆలోచించి తనకు ఓటు వేయాలని కోరారు.


 విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి సురేష్‌‌  రెంజర్ల

No comments:

Post a Comment