Friday, 15 March 2019

నామినేషన్‌‌కు ఒకరోజు ముందు బ్యాంక్‌‌ ఖాతా తీయాలి

‒కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు

   లోక్‌‌సభ అభ్యర్థిగా నామినేషన్‌‌ వేసే అభ్యర్థులు నామినేషన్‌‌ వేయడానికి ఒకరోజు ముందుగా మాత్రమే బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా కలెక్టర్‌‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రామ్మోహన్‌‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.  ఎన్నికల కమిషన్‌‌ ఆదేశాల ప్రకారం అభ్యర్థులు కాని, వారి ఎన్నికల ఏజెంట్‌‌ కాని జాయింట్‌‌ ఎకౌంట్‌‌ కాని బ్యాంక్‌‌ ఖాతా తీసుకోవచ్చన్నారు. అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుకు సంబంధించి అన్ని లావాదేవీలు ఈ ఖాతా నుండే నిర్వహించాలన్నారు. అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల కమిషన్‌‌ ఆదేశాలు, నియమ నిబంధనలు పాటించాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని కోరారు.


No comments:

Post a Comment