Saturday, 9 March 2019

శ్రీనిధి రాష్ట్ర స్థాయి పురస్కారాలకు జిల్లా అధికారుల ఎంపిక

 2017‒2018 సంవత్సరమునకు గాను తెలంగాణ ప్రవేశపెట్టిన శ్రీనిధి పథకం పంపిణీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు అందజేసే పురస్కరాలకు జిల్లా అధికారులు ఎంపికైనట్లు శ్రీనిధి మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ జి.విద్యాసాగర్‌‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఉత్తమ  డీఆర్‌‌వోగా నిజామాబాద్‌‌ డీఆర్‌‌డీవో వెంకటేశ్వర్లు  రాష్ట్ర స్థాయి మొదటి బహుమతికి ఎంపిక కాగా,  రాష్ట్ర ఉత్తమ ఏపీఎంగా ఆర్మూర్‌‌ ఏపీఎం బి.గంగాధర్‌‌కు మొదటి బహుమతి, ఉత్తమ ఏపీఎంగా సీహెచ్‌‌ రోజారాణి రెండవ బహుమతి, నిజామాబాద్‌‌, కామారెడ్డి జిల్లాల శ్రీనిధి రీజినల్‌‌ మేనేజర్‌‌ బి.శ్రీనివాస్‌‌ తృతీయ బహుమతి, శ్రీనిధి బోధన్‌‌ మేనేజర్‌‌ ఎం. ముఖీమ్‌‌, రాష్ట్ర స్థాయి రెండవ బహుమతికి ఎంపికైనట్లు ఆయన  తెలిపారు. వీరికి హైదరాబాద్‌‌లోని ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చరల్‌‌ యూనివర్సిటీలో ఈనెల 11న బహుమతులను ప్రధానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

No comments:

Post a Comment