Monday, 18 March 2019

కొనసాగుతున్న పోలీస్‌‌ కానిస్టేబుల్‌‌, ఎస్‌‌.ఐ దేహదారుఢ్య పరీక్షలు

  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  నాగారం మైదానంలో  ఎస్‌‌.ఐ, కానిస్టేబుల్‌‌ ఎంపిక దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.  13వరోజు  అయిన సోమవారం మొత్తం 1000 మంది  స్త్రీ, పురుష అభ్యర్థులను ఎంపిక కోసం పిలవగా 955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.   అభ్యర్థులకు పరుగు పందెం, లాంగ్‌‌జంప్‌‌, హైజంప్‌‌, ఎత్తు, ఛాతి డిస్కస్‌‌త్రో తదితర పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  మంచినీటి సౌకర్యం, అందుబాటులో మెడికల్‌‌ టీం, అంబులెన్స్‌‌ ఏర్పాటు చేశారు.No comments:

Post a Comment