Thursday, 14 March 2019

ఓటర్ల జాబితాకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్లియర్‌‌ చేయాలి


కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు
నిజామాబాద్‌‌ : ఓటర్ల జాబితాలో నమోదు, మార్పు చేర్పులకు వచ్చిన దరఖాస్తులన్నీ పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు ఆదేశించారు. ఆయన గురువారం తన ఛాంబర్‌‌లో సహాయ ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.  జాబితాలో ఏ ఒక్కరి పేరు కూడా మిస్‌‌కాకుండా  చూస్తూ.. మరోవైపు డూప్లికేట్స్‌‌ పూర్తిగా తొలగించాలన్నారు. ఆన్‌‌లైన్‌‌లో వచ్చిన ఫారం‒7 దరఖాస్తులను సరిగ్గా చెక్‌‌  చేయాలన్నారు. అన్ని పోలింగ్‌‌ కేంద్రాలలో బీఎల్‌‌వోల వివరాలు, ఫోన్‌‌నెంబర్లు, పోలింగ్‌‌ కేంద్రం సంఖ్య తదితర వివరాలు బద్రపరచుకోవాలన్నారు. పోలింగ్‌‌ కేంద్రాల మ్యాపింగ్‌‌, రూట్‌‌ మ్యాప్‌‌లు సిద్దం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా ముద్రణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ఫొటో ఓటర్‌‌స్లిప్‌‌లు సకాలంలో ఓటర్లకు పంపిణీ చేయుటకు అవసరమైన ప్రింటింగ్‌‌ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఈనెల 15, 16 తేదీలలో పూర్తి చేయాలన్నారు. ఓటింగ్‌‌పై పూర్తి స్థాయిలో అవగాహనకు ఓటరు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇ‒రోల్‌‌ అప్డేట్‌‌ చేయాలన్నారు. సి‒విజిల్‌‌ ఆప్‌‌ డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్‌‌వో అంజయ్య, నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ స్థాయి ఏఆర్‌‌వోలు జాన్‌‌ సాంసన్‌‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌‌, వేణు, రమేష్‌‌ రాథోడ్‌‌ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment