Saturday, 9 March 2019

ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని నిజామాబాదు రెడ్ క్రాస్ సొసైటి చైర్మెన్ డాక్టర్ నీలి రాంచందర్ అన్నారు. నిజామాబాదు  జిల్లా కేంద్రం  ఎల్లమ్మగుట్టలోని గాంధీ యువజన సంఘం ఆధ్వర్యంలో  ఇద్దరు పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషిన్లను అందజేశారు. శనివారం సంఘ భవనంలో జరిగిన కుట్టు మిషిన్ల పంపిణీ కార్యక్రమానికి డాక్టర్ రాంచందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. మహిళలు స్వయం ఉపాధి  పొందేందుకోసం గాంధీ యువజన సంఘం ముందుకు వచ్చి ఉచితంగా కుట్టు మిషిన్లు అందించడం అభినందనీయమన్నారు.  నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో  జ్యూట్ బ్యాగ్ తయారీలో శిక్షణ పొందిన మహిళలకు ఈ సందర్భంగా సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జేసిఐ ఇందూర్ జోన్ అధికారి చింతల గంగాదాస్, నెహ్రూ యువ కేంద్రం ప్రాజెక్టు అధికారి జి.తులసీధర్,  గాంధీ యువజన సంఘం అధ్యక్షుడు ఎం.పోచయ్య, కస్తూరి మహిళా సంఘం ప్రతినిధులు సిహెచ్ పద్మ, బి.అరుణ, కె.సంగీత తదితరులు పాల్గొన్నారు.

కుట్టుమిషన్‌‌లను అందజేస్తున్న గాంధీ యువజన సంఘం సభ్యులు

మహిళలకు సర్టిఫికెట్‌‌లను అందజేస్తున్న దృశ్యం

No comments:

Post a Comment